Ram Mohan Naidu: ఇది కార్మికులకు దక్కిన గౌరవం!
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:19 AM
పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు లభించడం.. నేత, వడుకు కార్మికులందిరికీ లభించిన గొప్ప గుర్తింపు అని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు.
పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపుపై కేంద్రమంత్రి రామ్మోహన్
పొందూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు లభించడం.. నేత, వడుకు కార్మికులందిరికీ లభించిన గొప్ప గుర్తింపు అని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఢిల్లీ నుంచి శనివారం ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో తిరుపతి లడ్డూ, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ తరువాత పొందూరు ఖాదీకే భౌగోళిక గుర్తింపు వచ్చిందన్నారు. మహాత్మాగాంధీ మన్ననలను పొందిన పొందూరు ఖాదీకి ఎట్టకేలకు విశిష్ట గౌరవం లభించిందని తెలిపారు. ఖాదీ కార్మికులకు ఆధునిక పరికరాలు అందించడమే కాకుండా వారికి మెరుగైన జీవనప్రమాణాలు అందిస్తామని, తద్వారా ఖాదీకి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పారు. భౌగోళిక గుర్తింపు వచ్చేందుకు సహకరించిన ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.