Share News

Politics over Tragedy: చావుపైనా రాజకీయం

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:03 AM

నిత్యం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న జగన్‌ రోత పత్రిక చివరకు చావుపైనా రాజకీయం చేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనను...

Politics over Tragedy: చావుపైనా రాజకీయం

  • కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై జగన్‌ రోత పత్రికలో నీచమైన రాతలు

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): నిత్యం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న జగన్‌ రోత పత్రిక చివరకు చావుపైనా రాజకీయం చేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనను కూటమి ప్రభుత్వానికి ముడిపెడు తూ అసత్య కథనం వండివార్చింది. ద్విచక్ర వాహనదారుడు శివశంకర్‌ బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేసి తాగడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఆదివారం సంచికలో అడ్డగోలు కఽథనం ప్రచురించింది. జగన్‌ పత్రిక తీరును ఎక్సైజ్‌ శాఖ తప్పుబట్టింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించిన ఎక్సైజ్‌ శాఖ అసలు అక్కడ బెల్టు షాపులే లేవని తేల్చింది. లైసెన్స్‌ పొందిన మద్యం షాపులో బైకర్‌ శివశంకర్‌ మద్యం కొనుగోలు చేస్తున్న వీడియోలను కూడా విడుదల చేసింది. కర్నూలు జిల్లా పెద్దటేకూరు గ్రామంలోని ‘రేణుక ఎల్లమ్మ వైన్స్‌’ అనే అధికారిక లైసెన్స్‌ మద్యం షాపు నుంచే మద్యం కొనుగోలు చేశాడని తెలిపింది. సీసీ కెమెరా దృశ్యాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి అదే షాపులో 7 గంటలకు, 8.25 గంటలకు వేర్వేరు సమయాల్లో మద్యం కొనుగోలు చేశాడని వివరించింది. ఆ షాపు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా జాతీయ రహదారి నుంచి 240 మీటర్లకు పైగా దూరంలో ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారమే ఏర్పాటైందని తెలిపింది. పైగా ఆ ప్రాంతంలో ఎక్కడా బెల్టు షాపులు లేవని స్పష్టం చేసింది. ఇలా అపోహలు కలిగించే వార్తలు ప్రచురించడం పట్ల ఎక్సైజ్‌ శాఖ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.


ఫేక్‌ ప్రచారాలకు కేరాఫ్‌ వైసీపీ: నజీర్‌

వైసీపీ పూర్తిగా ఫేక్‌ ప్రచారాలకు ప్రతీకగా మారిపోయిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ విమర్శించారు. కర్నూలు జిలా ్లలో బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృత్యువాతపడితే, ఈ విషాదాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన బైకర్‌ శివశంకర్‌ బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేశాడని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శివశంకర్‌ ప్రభుత్వ లైసెన్స్‌ షాపులోనే మద్యం కొనుగోలు చేశాడని తెలిపారు. ఫేక్‌ ప్రచారాలకు ఆ పార్టీ కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిందని విమర్శించారు.

Updated Date - Oct 27 , 2025 | 05:05 AM