Bheemavaram: పెళ్లిలోనూ రాజకీయ నినాదాలే
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:39 AM
వైసీపీ అధినేత జగన్ హాజరయిన ఓ పెళ్లి వేడుకలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
జగన్ పర్యటనలో క్యాడర్ అత్యుత్సాహం
సీఎం సీఎం అంటూ నినాదాలు...
బారికేడ్లు ఎత్తి పడేసిన కార్యకర్తలు
భీమవరం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ హాజరయిన ఓ పెళ్లి వేడుకలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహం బుధవారం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెండ్లి వేడుక వద్ద సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఒకరినొకరు తోసుకుంటూ ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. కార్యకర్తల సీఎం నినాదాలకు చిరునవ్వులు చిందిస్తూ... జగన్ వేడుక వద్దకు వెళ్లిపోయారు. వేదిక వద్దకు ఎవరూ వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్‌లను కార్యకర్తలు ఎత్తి పక్కన పడేశారు.