Share News

10 మందికి పోలీస్‌ సేవా పతకాలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:01 AM

రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్టాత్మక పోలీస్‌ సేవా పతకాలకు పది మంది ఎంపికైనట్టు జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

10 మందికి పోలీస్‌ సేవా పతకాలు

- జిల్లా స్పెషల్‌ బ్రాంచి ఏఎస్‌ఐ లక్ష్మణస్వామికి ఉత్తమ సేవా పతకం

- మిగిలిన తొమ్మిది మందికి సేవా పతకాలు

మచిలీపట్నం క్రైమ్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్టాత్మక పోలీస్‌ సేవా పతకాలకు పది మంది ఎంపికైనట్టు జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ సేవా పతకానికి జిల్లా స్పెషల్‌ బ్రాంచి ఏఎస్‌ఐ వై.లక్ష్మణస్వామి, సేవా పతకాలకు పెనమలూరు ఎస్సై ఎ.డి.ఎల్‌.జనార్ధన్‌, జిల్లా స్పెషల్‌ బ్రాంచి ఏఎస్‌ఐ కె.హేమానందం, మచిలీపట్నం పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వి.శ్రీనివాసరావు, అవనిగడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వెంకటేశ్వరరావు, డీఏఆర్‌ ఎఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జె.నందకిషోర్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ డబ్ల్యూఏఎస్‌ఐ బి.శాంతకుమారి, డీఏఆర్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ షేక్‌ ఇబ్రహీం, గుడివాడ టూటౌన్‌ కానిస్టేబుల్‌ షేక్‌ రిహాన్‌, కంకిపాడు కానిస్టేబుల్‌ పి.రాధాకృష్ణ ఎంపికయ్యారని పేర్కొన్నారు. పతకాలు సాధించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ గంగాధరరావు అభినందించారు.

Updated Date - Aug 15 , 2025 | 01:01 AM