Share News

పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:18 AM

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు ఆదేశిం చారు.

పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
దిగువ అహోబిలంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు ఆదేశిం చారు. దిగువ అహోబిలంలో బుధవారం రాత్రి కల్యాణోత్సవం జరుగు తున్న సందర్భంగా భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లోని క్యూలైన్లు, కల్యాణోత్సవం జరిగే ప్రదేశం, వీఐపీ, జనరల్‌ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏఎస్పీ వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌, రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:18 AM