Nidigunta Aruna: నేరాల్లో నాకు సహకరించింది వీరే
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:30 AM
అవును.. పలు నేరాల్లో పోలీసు ఉన్నతాధికారులే నాకు సహకరించారు అని నెల్లూరు కి‘లేడీ నిడిగుంట అరుణ గుట్టు విప్పినట్లు సమాచారం.
పోలీసు అధికారులు, ప్రముఖుల పేర్లు
బయటపెట్టిన కి‘లేడీ’ అరుణ?
నేటి మధ్యాహ్నంతో ముగియనున్న కస్టడీ
కోవూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘అవును.. పలు నేరాల్లో పోలీసు ఉన్నతాధికారులే నాకు సహకరించారు’ అని నెల్లూరు కి‘లేడీ’ నిడిగుంట అరుణ గుట్టు విప్పినట్లు సమాచారం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న ఆమెను మంగళవారం రెండో రోజు కూడా కోవూరు పోలీసు స్టేషనులో సీఐలు సుధాకరరెడ్డి, నాగేశ్వరమ్మ విచారించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు కేసుల్లో బాధితులు తనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసు అధికారుల వివరాలను అరుణ తెలియజేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా రౌడీషీటర్ శ్రీకాంత్‌కు, తనకు సహకరించిన పోలీసు అధికారుల జాబితాను కూడా ఇచ్చినట్లు తెలిసింది. అంతేగాక పలు నేరాలతో సంబంధమున్న ప్రముఖుల వివరాలనూ తెలియజేసినట్లు చెబుతున్నారు. పోలీసు కస్టడీ బుధవారం మధ్యాహ్నం వరకూ ఉంది. ఈలోపు మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.