Hospital Transfer: పోలీసు జీపులో ఆస్పత్రికి.. కవలలు జననం
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:01 AM
తుఫానులో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అంబులెన్సు రాక ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణిని పోలీసు జీపులో సకాలంలో ఆస్పత్రికి...
బాపట్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫానులో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అంబులెన్సు రాక ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణిని పోలీసు జీపులో సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో కవలలకు జన్మనిచ్చింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామంలో బుధవారం జరిగిందీ ఘటన. కొణికి పంచాయతీలోని కట్టావారిపాలేనికి చెందిన ఓ మహిళకు బుధవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. అప్పటికే గ్రామ సమీపంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో అంబులెన్స్ రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకొల్లు ఎస్‌ఐ తన జీపులోనే అంగన్వాడీ కార్యకర్తల సహాయంతో గర్భిణిని ఇంకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు కవలలు జన్మించారు.