Share News

Veldurthi Police: జవిశెట్టి సోదరుల హత్య కేసులో..పిన్నెల్లి సోదరులకు నోటీసులు

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:33 AM

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు వెల్దుర్తి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుండ్లపాడుకు జవిశెట్టి సోదరుల హత్య కేసులో...

Veldurthi Police: జవిశెట్టి సోదరుల హత్య కేసులో..పిన్నెల్లి సోదరులకు నోటీసులు

  • నేడు విచారణకు రావాలని పోలీసుల తాఖీదు

మాచర్ల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు వెల్దుర్తి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుండ్లపాడుకు జవిశెట్టి సోదరుల హత్య కేసులో శనివారం విచారణకు రావాలని ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ-6), పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (ఏ-7), వారి బంధువైన కండ్లకుంట సర్పంచ్‌ పిన్నెల్లి వెంకటరెడ్డి (ఏ-8)లకు ఈ నోటీసులిచ్చారు. రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా తాత్కాలిక బెయిల్‌ పొందారు. అయితే కేసు విచారణకు మాత్రం హాజరుకావాలని వారిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాచర్ల రూరల్‌ సీఐ నఫీజ్‌బాషా నేతృత్వంలో రామకృష్ణారెడ్డికి స్వయంగా శుక్రవారం నోటీసు అందజేశారు. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో తండ్రి వెంకటేశ్వరరెడ్డికి నోటీసు అందించారు. వెంకటరెడ్డి కుటుంబసభ్యులకూ నోటీసులిచ్చారు.

Updated Date - Sep 27 , 2025 | 05:34 AM