Vijayawada: హోంగార్డు అశ్లీల నృత్యాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:55 AM
ఖాకీ దుస్తులు ధరించి క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన హోంగార్డు చిన్నారుల ఎదుట ఓ మహిళతో కలిసి అశ్లీల నృత్యాలు చేశాడు.
చిన్నారుల ముందు యువతితో చిందులు
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్.. సస్పెన్షన్
విజయవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఖాకీ దుస్తులు ధరించి క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన హోంగార్డు చిన్నారుల ఎదుట ఓ మహిళతో కలిసి అశ్లీల నృత్యాలు చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అ య్యాయి. కృష్ణా జిల్లా ఉ య్యూరు మండలం గండిగుంట గ్రామానికి చెందిన బేతపూడి అజయ్‌కుమార్ పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కంకిపాడు ఇన్‌స్పెక్టర్ వద్ద జీపు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దినెలల క్రితం గండిగుంట గ్రామంలో సామాజిక భవనంలో సాంఘిక నాటకం రిహార్సల్‌లో పాల్గొన్నాడు. సాంఘిక నాటకానికి బదులుగా ఓ మహిళా డ్యాన్సర్‌తో కలిసి అశ్లీల నృత్య ప్రదర్శన చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. అజయ్‌కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.