Traffic Rules: రాంగ్ రూట్ పట్టొద్దు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:47 AM
జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్లొద్దు. భద్రతా నియమాలు పాటించాల్సిందే’ అని పోలీసులు స్పష్టం చేశారు.
నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు.. ఆటో డ్రైవర్లకు పోలీసుల కౌన్సెలింగ్
ఓర్వకల్లు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్లొద్దు. భద్రతా నియమాలు పాటించాల్సిందే’ అని పోలీసులు స్పష్టం చేశారు. ‘ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా!’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన చిత్ర కథనంపై కర్నూలు జిల్లా పోలీసులు స్పందించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు ఓర్వకల్లు మోడల్ స్కూల్‌లో ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘‘రాంగ్ రూట్‌లో వెళ్తే కేసులు నమోదు చేస్తాం. విద్యార్థులను ఎక్కించుకొని వెళ్లే క్రమంలో కచ్చితంగా సక్రమమైన దారిలో వెళ్లి... రాక్ గార్డెన్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. పరిమితికి మించి విద్యార్థులను ఆటోల్లో ఎక్కించుకోవద్దు. అధిక శబ్దంతో పాటలు పెట్టుకొని ఆటోలు నడపొద్దు’’ అని ఆటో డ్రైవర్లకు స్పష్టం చేశారు.