Construction Flaws: జగన్ సర్కారు పుణ్యమే
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:36 AM
మాజీ సీఎం జగన్ హయాంలో ఎగువ కాఫ ర్ డ్యామ్ ఎత్తును 41.5 మీటర్ల నుంచి 44 మీటర్లకు పెంచారు. నాణ్యతా లోపాలతో, సాంకేతిక ప్రమాణాలు పాటించకుండారాళ్లు, మట్టి పోసే సి ఎత్తు పెంచిన అప్పటి ఇంజనీరింగ్ అధికారులు గొప్ప ఘనకార్యం చేసినట్లు ప్రకటించుకున్నారు.
కాఫర్ డ్యాం ఎత్తులో నాణ్యతా లోపాలు
స్థూపాకారంలో పెంచిన వైనం
అప్పట్లోనే కుంగిన గైడ్‌బండ్
మాజీ సీఎం జగన్ హయాంలో ఎగువ కాఫ ర్ డ్యామ్ ఎత్తును 41.5 మీటర్ల నుంచి 44 మీటర్లకు పెంచారు. నాణ్యతా లోపాలతో, సాంకేతిక ప్రమాణాలు పాటించకుండారాళ్లు, మట్టి పోసే సి ఎత్తు పెంచిన అప్పటి ఇంజనీరింగ్ అధికారులు గొప్ప ఘనకార్యం చేసినట్లు ప్రకటించుకున్నారు. అయితే పిరమిడ్ తరహాలో కాకుండా స్థూపాకారంలో డ్యామ్ ఎత్తును పెంచడంతో దిగువన బలం చాలక 15 మీటర్ల మేర కుంగిం ది. దీంతో ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కోసం మెటీరియల్‌తో ఎగువ కాఫర్ డ్యామ్ పై నుంచి తిరుగుతున్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బట్రస్ డ్యామ్ వైపునుంచి వాహనాల రాకపోక లు సాగేలా ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఎగువ కాఫర్ డ్యామ్‌లో కుంగిన భాగాన్ని భారీ రాళ్లు, మట్టితో యుద్ధప్రాతిపదికన పూడ్చి రాకపోకల ను పునరుద్ధరించారు. జగన్ సర్కారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, సాంకేతిక లో పాలను పట్టించుకోకపోవడం ఈ ఘటనతో బయటపడ్డాయని పోలవరం ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదకు డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడంతో పాటు స్పిల్ చానల్ వైపు అడ్డుకట్టగా నిర్మించిన గైడ్‌బండ్ కుంగిపోయింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. 2019 తర్వాత పోలవరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణాల్లో లోపాలున్టట్లు గుర్తించింది. ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధ్యయనం కోసం అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్ర జల సంఘం నియమించింది. ఈ కమిటీ 28న రానుంది.
స్వల్పంగా కుంగిన ఎగువ కాఫర్ డ్యామ్
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు
పోలవరం/అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ ఎడమవైపు ఎగువన కొద్దిగా కుంగింది. అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పునరుద్ధరించారు. శుక్రవారం ఉదయం సమస్యను గమనించిన అధికారులు శనివారం నాటికి పూర్తి చేశారు. 2022 ఆగస్టు నాటి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎడమవైపు ఎగువ ప్రదేశంలో నీటిమట్టం ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయని భావించిన అధికారులు ఎగువ కాఫర్ డ్యామ్ వెడల్పు 9 మీటర్లు, ఎత్తు మరో 2 మీటర్లు పెంచి పటిష్ఠం చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో కొంతమేర కుంగింది. కుంగిన భాగాన్ని పునరుద్ధరించామని, బట్రస్ డ్యామ్ ఉండడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు.
ప్రాధాన్యం ఏంటంటే...
ప్రాజెక్టు నిర్మాణంలో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్) నిర్మాణం కోసం గోదావరి సహజ మార్గాన్ని వెనక్కి మళ్లించారు. అప్రోచ్ చానల్ ద్వారా స్పిల్ వేలోకి, అటు నుంచి స్పిల్ చానల్‌లోకి మళ్లించడానికి 2,364.60 మీటర్ల పొడవునా 42.50 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించారు. దిగువన గోదావరి సహజ మార్గం నుంచి జలాలు డ్యామ్‌లోకి రాకుండా 16.13 మీటర్ల పొడవునా 30.50 మీటర్ల ఎత్తున దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించారు. గోదావరికి ఎలాంటి వరదలు వచ్చినా ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులకు అడ్డంకులు లేకుండా నిర్మాణం చేశారు. అయితే గత ప్రభుత్వం నిర్మాణంలో జాప్యం చేయడంతో కాఫర్ డ్యామ్‌ల కాలపరిమితి మించిపోవడం వల్ల సీపేజ్ సమస్య మొదలైంది. దీంతో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. డీవాటరింగ్ ద్వారా నిరంతరాయంగా నీటిని తొలగిస్తూ, ఎగువ కాఫర్ డ్యామ్ పొడవునా బట్రస్ డ్యామ్ నిర్మించి సీపేజ్ సమస్యను అధిగమించి పనులు వేగంగా చేస్తున్నారు.
చకాచకా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. వరద పరిస్థితుల్లో సైతం డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనుల్లో 373 ప్యానెళ్లకు గాను ఇప్పటికే 142 పూర్తయ్యాయి. 41 శాతం డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 20, 26 తేదీలలోపు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.