Project Authority: పోలవరంపై నేడు, రేపు పీపీఏ సమీక్ష
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:48 AM
పోలవరం ప్రాజెక్టు పనులపై ఆ ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది.
నేడు హైదరాబాద్‌లో.. రేపు ప్రాజెక్టు సందర్శన
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులపై ఆ ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం హైదరాబాద్ పీపీఏ కార్యాలయంలో ప్రాజెక్టుపై సీఈవో అతుల్‌జైన్ సమగ్ర సమీక్ష చేయనున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి జైన్ బృందం చేరుకుంటుంది. శనివారం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. కీలకమైన డయాఫ్రమ్‌వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనుల తీరును పరిశీలిస్తుంది. ఈ నెలాఖరున అతుల్‌జైన్ రిటైరవుతున్నారు. ఈ నేపథ్యంలో చివరిసారిగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.