వైసీపీ పాలనలో పోలవరం విధ్వంసం: నిమ్మల
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:10 AM
2019 నాటికి 72శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు.. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురయ్యిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
పాలకొల్లు అర్బన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): 2019 నాటికి 72శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు.. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురయ్యిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పఽథకాలపై జగన్ మీడియా అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచి లబ్ధి పొందాలన్నదే జగన్ వ్యూహం అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని మంత్రి విమర్శించారు.