Share News

Cyber Crime Bust: కస్టమర్ల ఆధార్‌ నంబర్లతో సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:39 AM

కస్టమర్లను మోసం చేసి, వారి ఆధార్‌ నంబర్లతో సిమ్‌ కార్డులు తీసుకుని, సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్న పది మందిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Cyber Crime Bust: కస్టమర్ల ఆధార్‌ నంబర్లతో సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు

  • పలు ప్రాంతాల్లో పది మంది అరెస్టు

ఎండాడ (విశాఖపట్నం), డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కస్టమర్లను మోసం చేసి, వారి ఆధార్‌ నంబర్లతో సిమ్‌ కార్డులు తీసుకుని, సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్న పది మందిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) ఏజెంట్లు సిమ్‌కార్డుల కోసం వచ్చిన వారి నుంచి ఐరిస్‌, ఆధార్‌ కార్డుల నకళ్లు తీసుకుంటారు. ఐరిస్‌ సరిగా పడలేదని మరోసారి తీసుకుని, తరువాత మరో సిమ్‌ను యాక్టివేట్‌ చేసేవారు. వాటిని సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో నిడదవోలులో ఇద్దరు వొడాఫోన్‌ డిస్ట్రిబ్యూటర్లతో పాటు పెడన ప్రాంతానికి చెందిన ఎయిర్‌టెల్‌ డిస్ట్రిబ్యూటర్‌, నలుగురు ఏజెంట్లు, గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో నకిలీ జియోసిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

Updated Date - Dec 06 , 2025 | 04:42 AM