నాణ్యమైన విద్యే పీఎంశ్రీ లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:33 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ర్టాల భాగస్వామ్యంతో నూతన జాతీయ విద్యా విధానాలతో పథకాన్ని రూపొందించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
నూతన జాతీయ విద్యా విధానంతో ముందుకు
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు..
గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ఏర్పాటు
అధునాతన మరుగుదొడ్లు నిర్మాణం
జిల్లాలో మొదటి విడతలో 40 పాఠశాలలు
ఈ ఏడాది మరో నాలుగు పాఠశాలలు ఎంపిక
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ర్టాల భాగస్వామ్యంతో నూతన జాతీయ విద్యా విధానాలతో పథకాన్ని రూపొందించారు. జిల్లాలో మొదటి విడతలో 40 పాఠశాలలు మంజూరు చేశారు. కాగా రెండో విడతలో మరో నాలుగు స్కూళ్లను ఎంపిక చేశారు. ఫేజ్ -1లో 28 ఆటస్థలాలకు రూ.114.50 లక్షలు మంజూరు కాగా పగిడ్యాల మండలం ప్రాతకోట జడ్పీ పాఠశాల మినహా చేపట్టిన ఆటస్థలాలన్ని పూర్తయ్యాయి. ఫేజ్-2లో 8 ఆటస్థలాలకు రూ.38.25లక్షలు మంజూరు కాగా మూడు ఆటస్థలాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఐదు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు స్కూళ్లు, కళాశాలల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
నంద్యాల ఎడ్యుకేషన, జూన 3 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక ఆటస్థలాలు, క్రీడా పరికరాలు, ల్యాబ్‌లు, సురక్షిత మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ విద్యను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో అందించాలన్నదే పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ స్కీమ్) లక్ష్యం. 2022లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ర్టాల భాగస్వామ్యంతో నూతన జాతీయ విద్యా విధానాలతో పథకాన్ని రూపొందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా, ఉద్యోగావకాశాలకు తగిన నైపుణ్యాభివృద్ధికి కల్పించేలా, పర్యావరణ అనుకూల విధానా లు పాటిస్తూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి పీఎంశ్రీ పథకం ఎంతగానో దోహదపడుతోంది. సర్వ శిక్షా అభియాన ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్రం అందించే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40శాతం నిధులను మంజూరు చేయాల్సి వుంటుంది.
40 పాఠశాలలు ఎంపిక
ఆత్మకూరు మండలం వెంకటాపురం జడ్పీ పాఠశాల, బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట జడ్పీ హైస్కూల్, బండిఆత్మకూరు ఏపీ మోడల్‌స్కూల్, డోన ఏపీ మోడల్ స్కూల్, దొర్నిపాడు (జడ్పీహెచఎస్), గడివేముల మండలం గడిగరేవుల జడ్పీ హైస్కూల్, కొలిమిగుండ్ల ఏపీ మోడల్‌స్కూల్, కొత్తపల్లె (జడ్పీహెచఎస్), మిడ్తూరు ఏపీ మోడల్‌స్కూల్, నందికొట్కూరు మండలం కొణిదెల (జడ్పీహెచఎస్), అవుకు ఏపీ మోడల్‌స్కూల్, ప్యాపిలి మండలం హుశ్శేనాపురం (జడ్పీహెచఎస్), ఉయ్యాలవాడ ఏపీ మోడల్‌స్కూల్, పగిడ్యాల మండలం ప్రాతకోట (జడ్పీహెచఎస్), పాములపాడు ఏపీ మోడల్‌స్కూల్ ఎంపికయ్యాయి. పాణ్యం ఏపీ మోడల్‌స్కూల్, రుద్రవరం ఏపీ మోడల్‌స్కూల్, సంజామల మండలం పేరుసోముల జడ్పీస్కూల్, శిరువెళ్ల ఏపీ మోడల్‌స్కూల్, వెలుగోడు ఏపీ మోడల్‌స్కూల్, ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు ఏపీ మోడల్‌స్కూల్, బేతంచర్ల మండలం రంగాపురం (జడ్పీహెచఎస్) ఉన్నాయి. చాగలమర్రి జడ్పీ ఓజీ హైస్కూల్, గోస్పాడు ఏపీ మోడల్‌స్కూల్, జూపాడుబంగ్లా ఏపీ మోడల్‌స్కూల్, కోవెలకుంట్ల ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, మహానంది మండలం ఎం.తిమ్మాపురం ఏపీ మోడల్‌స్కూల్, నంద్యాల మండలం కొత్తపల్లె జడ్పీ హైస్కూల్‌ను ఎంపిక చేశారు.
ఆటస్థలాలు
ఫుట్‌్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన, అథ్లెటిక్స్ వంటి క్రీడల అభివృద్ధికి అవసరమైన మైదానాలను జిల్లాలో 36 మంజూరుచేశారు. ఫేజ్ -1లో 28 ఆటస్థలాలకు రూ.114.50 లక్షలు మంజూరు కాగా పగిడ్యాల మండలం ప్రాతకోట జడ్పీ పాఠశాల మినహా చేపట్టిన ఆటస్థలాలన్ని పూర్తయ్యాయి. ఫేజ్-2లో 8 ఆటస్థలాలకు రూ.38.25లక్షలు మంజూరు కాగా మూడు ఆటస్థలాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఐదు వివిధ దశల్లో ఉన్నాయి.
కిచెన గార్డెన్స
విద్యార్ధుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, ఆహారబధ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి బాధ్యతాయుతమైన విలువలను పెంపొందించేలా పాఠశాల ప్రాంగణంలోనే చిన్న తరహా తోటలను ఏర్పాటుచేసి అందులో కూరగాయాలు, పండ్లు, సుగంధద్రవ్యాలు తదితర మొక్కలను పెంచడం లాంటి పనులు చేపట్టారు. ప్రధానంగా సేంద్రీయ పద్ధతుల్లో పండించడం నేర్పించాలి. కిచెన గార్డెనలు ఏర్పాటుచేసేందుకు 27 పాఠశాలలకు రూ.34.29లక్షలు మంజూరు చేశారు. కేటాయించిన వాటిలో ఐదు పాఠశాలలు వెనుకంజలో ఉండగా 22 పాఠశాలల్లో కిచెనగార్డెనలు ఏర్పాటుచేశారు.
సీడబ్ల్యూఎస్ మరుగుదొడ్లు
బాలికల హాజరు శాతాన్ని పెంచేలా, ప్రత్యేకంగా బాలికల కోసం నిరంతర నీటి సరఫ రాతో కూడిన అధునాతన మరుగుదొడ్లు నిర్మించేందుకు 10 పాఠశాలలను ఎంపికచేసి రూ.39.05లక్షల నిధులను మంజూరు చేసింది. ఇందులో 8 మరుగుదొడ్లు పూర్తి కాగా రెండు మధ్యలోనే నిలిచిపోయాయి.
ర్యాంపులు ఏర్పాటు
దివ్యాంగ విద్యార్థులకు, వృద్ధులకు, మెట్లు ఎక్కలేని వారికి అనువుగా ఉండేందుకు ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో గుర్తించిన 22 పాఠశాలలను ఎంపిక చేయగా, వాటికి రూ.11లక్షలు మంజూరు చేశారు. 22 పూర్తయ్యాయి.
విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా..
విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా కళాశాలల్లో, పాఠశాలల్లో గ్రంథాలయాలతో పాటు, ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తున్నారు. అందుకు గాను రెండో విడతలో నిధులు మంజూరయ్యాయి. డోన, కోవెలకుంట్ల, శిరువెళ్ల జడ్పీ హైస్కూళ్లకు సైన్సల్యాబ్‌లను మంజూరుచేయగా అందుకు గాను 58.92లక్షలు మంజూ రయ్యాయి. ఆళ్లగడ్డలోని ఏఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాలకు కెమిస్ర్టీ ల్యాబ్‌కు రూ.19.64 లక్షలు, ఆళ్లగడ్డ ఏపీఆర్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు లైబ్రరీ, డోన, నంద్యాల బాలికల పాఠశాల లకు లైబ్రరీలు, శిరువెళ్లలోని జడ్పీ హైస్కూల్ లైబ్రరీకి రూ.78.56లక్షలు మంజూరయ్యాయి.
నిధులు మంజూరు కావాలి.
జిల్లాలో పీఎంశ్రీ పథకానికి మరో నాలుగు పాఠశాలలు మంజూరయ్యాయి. నెరవాడ ఏపీఆర్‌ఎస్, ఏపీఆర్‌డబ్ల్యూఎస్ లక్ష్మాపురం, జూపాడుబంగ్లా, ఆళ్లగడ్డ పాఠశాలలు ఎంపికయ్యాయి. నిధులు మంజూరు కావాల్సి ఉంది. గత ఏడాది మంజూరై పూర్తికాని వాటిపై ప్రత్యేక దృష్టిసారించాం. వాటిని కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో స్థలాలను గుర్తించి పూర్తిచేస్తాం.
ఫ ప్రేమంతకుమార్, ఏపీసీ, సమగ్రశిక్ష, నంద్యాల