Share News

Narendra Modi: ఏపీకి గుడ్ న్యూస్.. బద్వేల్-నెల్లూరు కారిడార్‌కు అనుమతి.. ప్రధాని ట్వీట్

ABN , Publish Date - May 28 , 2025 | 10:13 PM

నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం పొందిన 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని, రాష్ట్ర యువతకు పలు అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Narendra Modi: ఏపీకి గుడ్ న్యూస్.. బద్వేల్-నెల్లూరు కారిడార్‌కు అనుమతి.. ప్రధాని ట్వీట్
badvel nellore corridor

ఏపీకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 108 కిలోమీటర్లు పొడవైన నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం పొందిన 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని, రాష్ట్ర యువతకు పలు అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


ఆ నాలుగు వరుసల కారిడార్‌ను రూ.3653 కోట్లతో నిర్మించబోతున్నారు. ఈ నాలుగు లేన్ల కారిడార్ వైఎస్సార్ కడప జిల్లాలోని గోపవరం నుంచి ప్రారంభమై నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు జంక్షన్ దగ్గర ముగుస్తుంది. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ప్రాధాన్య నోడ్‌గా గుర్తించిన కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న రహదారితో పోల్చుకుంటే ఈ కారిడార్ ద్వారా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే దూరం 33.9 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ప్రయాణ సమయం దాదాపు గంట వరకు ఆదా అవుతుంది.


ఇవీ చదవండి:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 30 , 2025 | 02:54 PM