Share News

International Yoga Day: యోగా డేకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 22 , 2025 | 06:36 AM

విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించేందుకు 23 మంది అధికారులను నియమించింది. ఏర్పాట్లను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

International Yoga Day: యోగా డేకు పకడ్బందీ ఏర్పాట్లు

నోడల్‌ అధికారిగా ఎంటీ కృష్ణబాబు

23 మంది అధికారులకు బాధ్యతలు.. సీఎస్‌ ఉత్తర్వులు

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో మరింత అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఏర్పాట్లను సీఎం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్ల నిర్వహణ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 23 మంది అధికారులను నియమించింది. వారందరికీ వివిధ రకాల బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. యోగా డే నిర్వహణ బాధ్యతలు ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్‌ ఎంటీ కృష్ణబాబుకు అప్పగించారు. కార్యక్రమ బాధ్యతలు మొత్తం విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.హరేందిరప్రసాద్‌కు అప్పగించారు. యోగా డే మినిట్‌ టూ మినిట్‌ కార్యక్రమాన్ని రూపొందించడం, జిల్లా అధికారులతో సమన్వయం, ప్రధాన మంత్రి కార్యాలయంతో సమన్వయం బాధ్యతలను జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనాకు అప్పగించారు. 23 మంది అధికారులు విశాఖ జిల్లా కలెక్టర్‌తో పాటు నోడల్‌ అధికారితో సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 06:36 AM