Sathyasai centenary celebrations: రేపు పుట్టపర్తికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:12 AM
సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి బుధవారం రానున్నారు....
హిల్ వ్యూ స్టేడియంలో సభకు ఏర్పాట్లు
పుట్టపర్తి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి బుధవారం రానున్నారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ప్రధాని సభ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని బుధవారం ఉదయం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం, హిల్‌వ్యూ స్టేడియం దాకా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పుట్టపర్తికి ఈ నెల 22న రానున్నారు.