Share News

మావూరి రహదారిని బాగు చేయండి సారూ..!

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:05 AM

మండల పరిధిలోని చిన్నవెంతుర్ల నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెద్దవెంతుర్ల గ్రామాల మధ్య ఉన్న తారురోడ్డు మరమ్మతులు చేయించాలని చిన్నవెంతుర్ల గ్రామస్థులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార ్దన్‌రెడ్డిని కోరారు.

మావూరి రహదారిని బాగు చేయండి సారూ..!
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి సమస్యను వివరిస్తున్న చిన్నవెంతుర్ల గ్రామస్థులు

ఆర్‌అండ్‌బీ మంత్రికి చిన్నవెంతుర్ల గ్రామస్థుల వినతి

మైలవరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని చిన్నవెంతుర్ల నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెద్దవెంతుర్ల గ్రామాల మధ్య ఉన్న తారురోడ్డు మరమ్మతులు చేయించాలని చిన్నవెంతుర్ల గ్రామస్థులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార ్దన్‌రెడ్డిని కోరారు. సోమవారం జమ్మలమడుగు ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహంలో మంత్రిని కలిసి వారు రహదారి సమస్యను వివరించి వినతిపత్రం అందించారు. మూడు కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిలో వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనాలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డు కొత్తరోడ్డు వేయకుండా కనీసం మరమ్మతులు చేయించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా రహదారులకు మరమ్మతులు చేశారని గ్రామ పరిదిలోని రహదారిని పట్టించుకోలేదని మంత్రికి తెలుపగా ప్రజల సమస్యలు ఆలకించిన మంత్రి గ్రామస్థుల ముందే ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి వీలైనంత త్వరగా రహదారికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మంత్రికి వినతి పత్రం అందించినవారిలో మాజీ సర్పంచు శివరామిరెడ్డి, డీలరు బాస్కర్‌, బండల చిన్నమహమ్మద్‌, బెస్తవేముల పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:05 AM