ప్రణాళికాబద్ధంగా ఖాళీల భర్తీ: సత్యకుమార్
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:24 AM
ఆరోగ్యశాఖలో ఖాళీలను ప్రణాళికాబద్ధంగా భర్తీ చేయాలని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారుల ను ఆదేశించారు.
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో ఖాళీలను ప్రణాళికాబద్ధంగా భర్తీ చేయాలని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారుల ను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖలో వివిధస్థాయిల్లో మంజూరైన పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలపై ఆయన ఆరా తీశారు. గతేడాది జూన్ నుంచి చేపట్టిన నియామకాల వివరాలు తెలుసుకున్నారు. ఆయుష్, ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ), ఆహార పదార్థాల కల్తీ నిరోధక విభాగాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెడి తే.. రిపోర్టులు వెంటనే రోగులకు పంపడం సులువుగా ఉంటుందని చెప్పా రు. కాగా, ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ డీఎ్‌సవీఎల్ నరసింహంను మంత్రి సత్యకుమార్ అభినందించారు. వివాదరహితుడిగా పేరుగాంచారని అన్నారు.