AP Lidcap Chairman: విద్యార్థులను అభినందించే సంస్కారమూ లేదా
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:08 AM
గురుకుల పాఠశాలల్లో కష్టపడి చదివి ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో రాణించిన 55 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సీఎం చంద్రబాబు...
జగన్‌పై పిల్లి మాణిక్యరావు ఆగ్రహం
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో కష్టపడి చదివి ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో రాణించిన 55 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికీ రూ.లక్ష బహుమతి అందజేశారని, కానీ జగన్ దళిత విద్యార్థుల విజయాలను అభినందిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదని ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అభినందించే సంస్కారమూ లేదా అని నిలదీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.