School Education Department: ప్రైవేటు స్కూళ్లలో వ్యాయామ విద్య
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:51 AM
ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాయమ విద్య తప్పనిసరిగా అమలుచేయాలని స్పష్టంచేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాయమ విద్య తప్పనిసరిగా అమలుచేయాలని స్పష్టంచేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రతిరోజూ గంట సమయాన్ని వ్యాయామ విద్య, సంబంధిత కార్యక్రమాలకు కేటాయించాలని ఆదేశించింది. దీనిని రెగ్యులర్ టైమ్‌టేబుల్‌లో చేర్చాలని పేర్కొంది. రోజుకు పది నిమిషాలు ధ్యానానికి, వారంలో ఒక పీరియడ్‌ను హెల్త్ ఎడ్యుకేషన్‌కు కేటాయించాలని స్పష్టం చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి మినహాయింపు లేదని, 1-10 తరగతులకు తరగతి గదుల్లోనే యోగా, ధ్యానం నిర్వహించాలని సూచించింది.