Liquor Scam Venkatesh Naidu Case: ఫోన్‌లో సమాచారం లీక్ చేశారు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:25 AM
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని సమాచారాన్ని సిట్ అధికారులు మీడియాకు లీక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ...
స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించండి
హైకోర్టును ఆశ్రయించిన మద్యం కేసు నిందితుడు వెంకటేశ్ భార్య
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని సమాచారాన్ని సిట్ అధికారులు మీడియాకు లీక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిందితుడు వెంకటేశ్ నాయుడు(ఏ34) భార్య మహిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీడియా ట్రయల్ నిర్వహిస్తూ న్యాయ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు తన భర్త నుంచి ఫోను తీసుకున్నారని, ఫోన్‌లోని సమాచారం లీక్ చేయడం వెనుక ఆయనే ఉన్నట్లు నమ్ముతున్నానని పేర్కొన్నారు. పత్రికలు, మీడియా, వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ప్రచురించిన సమాచారాన్ని తఫోన్‌లోని సమాచారాన్ని ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.క్షణం తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.