PHC Doctors Stage Protest: డిమాండ్ల సాధనకు పీహెచ్‌సీ వైద్యుల ధర్నా
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:09 AM
తమ న్యాయమైన డిమాండ్‌లను తక్షణమే అమలు చేయాలని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు....
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
విజయవాడ (ధర్నాచౌక్), అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్‌లను తక్షణమే అమలు చేయాలని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం వారు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అస్పష్టమైన విధానాలు, తరచూ మారే ఆదేశాలు, జీవోలు, అర్జెంట్ రివ్యూలు, ఇతర విభాగాల జోక్యంతో గ్రామీణ వైద్యులపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. అనేకసార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో గత 10 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.