Education Department: పీజీ సెట్ అర్హత లేకపోయినా అడ్మిషన్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:04 AM
ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఇతర పీజీ కోర్సుల్లో చేరేందుకు ఈ ఏడాదికి అర్హత మినహాయింపునిస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఇతర పీజీ కోర్సుల్లో చేరేందుకు ఈ ఏడాదికి అర్హత మినహాయింపునిస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కోర్సుల్లో చేరేందుకు పీజీసెట్ రాసి అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా... వారికి కూడా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. యూనివర్సిటీల కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను స్పాట్ కోటాలో భర్తీ చేయాలని స్పష్టంచేసింది. అయితే ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదు.