Vijayawada ACB Court: చంద్రబాబు కేసుల వివరాలపై దాఖలైన పిటిషన్ వెనక్కి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:49 AM
విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసిన సీఎం చంద్రబాబు కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం రిటర్న్ చేసింది
విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వు
విజయవాడ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసిన సీఎం చంద్రబాబు కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం రిటర్న్ చేసింది. మద్యం, ఫైబర్‌నెట్, స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఫైబర్‌నెట్, మద్యం కేసులను ఇటీవల కోర్టు కొట్టేసింది. వాటికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు నివేదిక, తీర్పు కాపీలు, 164 సెక్షన్ కింద రికార్డుచేసిన వాంగ్మూలాల ప్రతులను తనకివ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి వేము కొండలరావు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. బుధవారం దానిని ఆయనకు వెనక్కి ఇస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు.