Share News

Visakhapatnam: రేపటి నుంచి విశాఖలో పెసా మహోత్సవ్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:52 AM

పెసా చట్టం-1996 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో ‘పెసా మహోత్సవ్‌’ నిర్వహించనున్నట్టు...

Visakhapatnam: రేపటి నుంచి విశాఖలో పెసా మహోత్సవ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పెసా చట్టం-1996 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో ‘పెసా మహోత్సవ్‌’ నిర్వహించనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మహోత్సవాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రారంభిస్తారని తెలిపారు. వేడుకలో పది రాష్ట్రాలకు చెందిన పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు, సాంస్కృతిక కళాకారులు, ఇతర రంగాలకు చెందిన దాదాపు రెండు వేలమంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 05:52 AM