PESA Mahotsav Kicks Off: అట్టహాసంగా పెసా మహోత్సవ్ ప్రారంభం
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:32 AM
పెసా మహోత్సవం మంగళవారం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. పది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కళాకారులతో ఉత్సవ్...
విశాఖపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘పెసా’ మహోత్సవం మంగళవారం విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. పది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కళాకారులతో ఉత్సవ్ తొలిరోజు ఉత్సాహంగా సాగింది. ఉదయం బీచ్‌రోరోడ్డులో 10కె రన్ నిర్వహించారు. రన్‌ను ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, కేంద్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్ ప్రారంభించారు. అనంతరం పోర్టు స్టేడియం వేదికగా ఉత్సవ్‌ను ముక్తా శేఖర్ ప్రారంభించారు. ఏపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల ఉత్పత్తులతో 68 స్టాళ్లు ఏర్పాటుచేశారు.