Budda Venkanna: పేర్ని, సజ్జలకు మతి భ్రమించింది
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:51 AM
వైసీపీ నాయకులు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి శుద్ధపూసలా!: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుద్ధపూసలు అన్నట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరో మూడు దశాబ్దాలు గడిచినా కూడా వైసీపీ అధికారంలోకి రావటం కల్ల అన్నారు. పేర్ని, సజ్జల వల్ల ఆ పార్టీ మరింతగా దిగజారిపోతోందన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.