Share News

Perni Nani: 12 బాక్సుల్లో 11 కోట్లేనా

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:32 AM

12 డబ్బాల్లో రూ. 12 కోట్లు ఉండాలి కదా! రూ. 11 కోట్లే ఉన్నాయని చెబుతున్నారేంటి. మిగిలిన కోటి ఎవరు కొట్టేశారు’ అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు.

Perni Nani: 12 బాక్సుల్లో 11 కోట్లేనా

  • మరో కోటి ఎవరు కొట్టేశారు: పేర్ని నాని

మచిలీపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘12 డబ్బాల్లో రూ. 12 కోట్లు ఉండాలి కదా! రూ. 11 కోట్లే ఉన్నాయని చెబుతున్నారేంటి.? మిగిలిన కోటి ఎవరు కొట్టేశారు’ అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌పై నిందలు వేయడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో రాజ్‌ కసిరెడ్డి రూ. 11 కోట్లు దాచుకున్నాడని, ఇప్పుడు ఆ నగదును స్వాఽధీనం చేసుకున్నామని చెబుతున్నారన్నారు. అతడిని ఓ లిక్కర్‌ డాన్‌గా పత్రికల్లో రాస్తున్నారని, అలాంటి వ్యక్తి రూ. 11 కోట్లను ఇంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంచుతాడా? అంటూ ప్రశ్నించారు. ఈస్కాంపై ఎలక్షన్‌ వచ్చేవరకు చార్జిషీట్‌ వేయరని చెప్పారు. ఈ కేసులో జగన్‌ పేరు చెప్పాలని వాసుదేవరెడ్డిని హింసిస్తే, ఆయన హైకోర్టులో కేసు వేశాడన్నారు. దీంతో ఆయనను విడిచిపెట్టారని చెప్పారు. విజయసాయిరెడ్డి అనుకూలంగా మారడంతో ఆయన్ను వదిలేశారన్నారు. చంద్రబాబు హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Updated Date - Jul 31 , 2025 | 04:33 AM