TDP: దాడులకు ఉసిగొల్పుతున్న పేర్ని నాని
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:49 AM
శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు శనివారం మచిలీపట్నంలోని...
మచిలీపట్నం, అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో టీడీపీ ఫిర్యాదు
మచిలీపట్నం, జూలై 12(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు శనివారం మచిలీపట్నంలోని రాబర్ట్‌సన్‌పేట, అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలో జరిగే వైసీపీ సమావేశాల్లో పాల్గొంటున్న పేర్ని నాని తీరుతో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, విచారణ చేసి చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.