Share News

Vijayawada Court: పేర్ని నానికి వారెంట్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:44 AM

వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున నానికి వారెంట్‌ జారీ చేశారు. ‘సినీ నటుడు చిరంజీవే నన్నేం చేయలేకపోయారు.

Vijayawada Court: పేర్ని నానికి వారెంట్‌

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత పేర్ని నానిపై సోమవారం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున నానికి వారెంట్‌ జారీ చేశారు. ‘సినీ నటుడు చిరంజీవే నన్నేం చేయలేకపోయారు. నాకు చిరంజీవి కులానికి చెందిన ఓట్లు అక్కర్లేదు’ అని ఒక యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలోనే పవన్‌ ఏం చేస్తాడంటూ మాట్లాడారు. దీనిపై స్థానికులు తుమ్మ ల చందు, చిలంకుర్తి శ్రీహర్ష చిలకలపూడి పోలీ్‌సస్టేషన్‌లో 2019 మే 2న ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది.

Updated Date - Jun 17 , 2025 | 05:47 AM