Nimmala Ramanaidu: సముద్రపు నీటి ముంపునకు శాశ్వత పరిష్కారం!
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:45 AM
గోదావరి జిల్లాల్లో సముద్రపు నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
గోదారి జిల్లాల్లో పంటలు కాపాడేందుకు చర్యలు: నిమ్మల
గోదావరి జిల్లాల్లో సముద్రపు నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సముద్రపు నీటి ముంపు వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వాటిని అంచనా వేసేందుకు రూ.13.4 కోట్లతో లైడార్ సర్వే చేపడుతున్నామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శంకర గుప్తం డ్రైన్ సమస్యను రైతులు, రైతు నాయకులు తన దృష్టికి తెచ్చారని, ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా సమస్యను పరిశీలించానని, సముద్రపు నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20.72 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన స్పందించారని తెలిపారు.