Flood Prevention: బుడమేరు గండికి కాంక్రీట్ పరిష్కారం
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:49 AM
బుడమేరుకు పడ్డ గండి గుర్తుంది కదా. విజయవాడ నగర వాసులకు కాళరాత్రులను పరిచయం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్ బుడమేరుకు పడ్డ గండి గుర్తుంది కదా. విజయవాడ నగర వాసులకు కాళరాత్రులను పరిచయం చేసింది. వరద పోటెత్తడంతో రెండు వారాలకు పైగా బెజవాడ జనం నీళ్లలోనే ప్రాణాలరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకూ జనం చెంతనే ఉండి బాధితులకు అండగా నిలిచారు. ఆనాటి కష్టం పునరావృతం కారాదని ప్రతినబూనిన ప్రభుత్వం దానికి శాశ్వత పరిష్కారం చూపించింది. అనుకున్నదే తడవుగా ఏడాది లోపే కాలువ పొడవునా కాంక్రీట్ గోడను నిర్మించింది. బెజవాడ వాసులకు భవిష్యత్తులో బుడమేరు ముప్పు లేకుండా చేసింది.