Share News

డంపర్‌బిన్లకు చిల్లులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:36 PM

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో చెత్తాచెదారం సేకరణకు ఏర్పాటు చేసిన డంపర్‌బిన్లుకు (చెత్తకుండీలు )పెద్దపెద్ద చిల్లులు పడ్డాయి.

డంపర్‌బిన్లకు చిల్లులు
ఎస్పీఐ కాలనీలో ఇలా చిల్లులు పడిన డంపర్‌బిన్లు

రోడ్లుపై చెత్తాచెదారం

అపరిశుభ్రంగా పరిసరాలు

వెదజల్లుతున్న దుర్వాసన

ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు

నంద్యాల టౌన, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో చెత్తాచెదారం సేకరణకు ఏర్పాటు చేసిన డంపర్‌బిన్లుకు (చెత్తకుండీలు )పెద్దపెద్ద చిల్లులు పడ్డాయి. చెత్తంతా రోడ్లపైనే పడుతోంది. పందులు, కుక్కలు చిందరవందరగా చేస్తున్నాయి. దాంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల పట్టణంలో సుమారుగా 42 వార్డులు ఉండగా, లక్షకు పైగా జనాభా ఉన్నది. ప్రతి రోజు పట్టణానికి వచ్చి పోయ్యేవారు సుమారుగా 20వేలకు పైగా ఉన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు చాలా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం పట్టణంలో పలు కాలనీల్లో 85 డంపర్‌బిన్లు ఏర్పాటు చేశారు. చెత్తాచెదారాన్ని డంపర్‌బిన్లలో వేస్తే కంపాక్టు యంత్రవాహనాలు చెత్త వ్యర్థాలను యార్డుకు తరలిస్తాయి. డంపర్‌బిన్లలో అధికశాతం పెద్ద పెద్ద రంధ్రాలు పడగా, కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇళ్లల్లో పోగయ్యే తడి, పోడి చెత్త నిల్వకు పురపాలిక అధికారు లు ప్రతి ఇంటికి ప్లాస్టిక్‌ బు ట్టులు సరఫరా చేశారు. కొన్నాళ్లు ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరిగినా త ర్వాత పట్టించుకోలేదు. ప్రస్తు తం పది శాతమే ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోంది. దాంతో చాలామంది నేరు గా డంపర్‌బిన్ల సమీపంలో నే చెత్త వేస్తున్నారు. దాం తో చెత్త అంతా రోడ్లమీదే పడుతోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మురుగు కాల్వల్లోకి చేరుతోంది. దుర్వాసనలు వెదజల్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్వల్లో చేరే చెత్తతో వర్షాలు పడినప్పుడు నీరు సాఫీగా ప్రవహించక రోడ్డుపైకి, ఇళ్లల్లోకి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో చెత్తపైనే ఎక్కువ చర్చ కొనసాగిస్తున్నా పరిష్కారం చూపడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

టెండర్లను ఆహ్వానించాం

ఇటీవలే టెండర్లను ఆహ్వానించాం. కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం. శాంపిల్‌ డంపర్‌ బిన కూడా తెప్పించాం. వాటి క్వాలీటి అన్నింటిని చెక్‌ చేసి టెండర్‌దారుడు రాగానే కొత్తవి చేయించి ఏర్పాటు చేస్తాం.

మురళి, శానిటైజేషన అధికారి నంద్యాల

Updated Date - Dec 07 , 2025 | 11:36 PM