స్వచ్ఛమైన గాలితోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:52 PM
స్వచ్ఛమైన గాలి తో నే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మావతీబాయి అన్నారు.
ఆత్మకూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛమైన గాలి తో నే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మావతీబాయి అన్నారు. శనివారం స్వచ్చాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన గాలి అనే అంశం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, పీస్‌లిల్లీ, అల్లోవీరా, డ్రసి నా, పిల్లోడెండ్రాన తదితర మొక్కలు కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయని తెలిపారు. ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల గాలిలో ఉండే కాలుష్య కారకాలను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని ఇస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కృష్ణ, రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.