Share News

రోడ్డు విస్తరణ పనులతో ప్రజల పాట్లు

ABN , Publish Date - May 12 , 2025 | 11:46 PM

ముద్దనూరు టౌన్‌లో రోడ్డు విస్తరణ పనులు మందకొడిగా సాగుతుండడంతో ప్రజ లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. .

రోడ్డు విస్తరణ పనులతో ప్రజల పాట్లు
రోడ్డు పై కంకరవేయడంతో అవస్థలు పడుతున్న జనం

ముద్దనూరు మే12(ఆంధ్రజ్యోతి):ముద్దనూరు టౌన్‌లో రోడ్డు విస్తరణ పనులు మందకొడిగా సాగుతుండడంతో ప్రజ లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. .అందులో భాగంగా డ్రైనేజీ కాల్వ, మంచినీటి పైపు లైను పనులు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కాల్వ, రోడ్డు .పనులు మందకోడిగా నడుస్తుండటంతో ప్రజలు ప్రమాద బారీన పడుతున్నారు.వివరాల్లోకి వెళితే...ముద్దనూరు టౌన్‌లో రూ.9కోట్ల నిధులతో నేషనల్‌ హైవే వారు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా డ్రైనేజీ కాల్వ పనులు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు 2కిలోమీటర్లు కాల్వ పనులు చేయాల్సి ఉంది.ఒక పక్క మాత్రమే కాల్వ పనులు చేస్తున్నారు. దాదాపు మూడు నెలలు కావస్తున్న అర కిలో మీటరు కాల్వ పనులు చేశారు. అది కూడా అసంపూర్తిగా ఉంది. కాల్వ పక్కన పైపు లైను కోసం తీసిన గుంతలు పూడ్చలేని పరిస్థితులు ఉన్నాయి.పైపులు వేయక పోవడంతో గుంతలు అలాగే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి కాల్వ గుంత అలాగే ఉండటంతో దుకాణదారులు వ్యాపారాలు చేసుకోలేక, కొన్ని వీధులకు ప్రజలు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది గుంత పై నుంచి దాటబోతు గుంతలో పడి ప్రమాదాలకు గురౌతున్నారు. కాల్వ పనులు పూర్తికాక ముందే ఆఘవేఘాల మీద రోడ్డు పనులు చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. 7 మీటర్లు ఉన్న రోడ్డును ఒకే సారి చేస్తున్నారు. రోడ్డు పై కంకర వేయడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. సందుల్లో నుంచి వెళదామన్నా గుంతలు తీశారని, ఒక్క పనికూడా సక్రమంగా చేయడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధి త అధికారులు స్పందించి రోడ్డు పనులు సక్రమమైన పద్ధతిలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చేయాలని కోరుతున్నారు.

Updated Date - May 12 , 2025 | 11:46 PM