వైసీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: పల్లా
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:25 AM
సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ విజయవంతమైంది. వైసీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరుఅని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు
అనంతపురం క్రైం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ విజయవంతమైంది. వైసీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ ‘జగన్ గత 15 నెలలుగా ఇంట్లో కూర్చుని, ఫేక్ ప్రచారాలతో గడుపుతున్నారు. అనుకూల మీడియాతో సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. విశాఖ స్టీల్, అమరావతి నిర్మాణం, రాయలసీమ రైతులు, వైద్య కళాశాలల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యూరియాపై కేంద్రంతో మాట్లాడి, రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.