Share News

ప్రజలు భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:42 PM

రాష్ట్ర ప్రభుత ్వం ప్రతిష్టాత్యకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు.

ప్రజలు భాగస్వాములు కావాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు

కలెక్టర్‌ రాజకుమారి

జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’

నంద్యాల నూనెపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత ్వం ప్రతిష్టాత్యకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక కర్తవ్యంగా భావించాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యకర జీవనానికి, సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందన్నారు. డీఆర్వో రాంనాయక్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సిబ్బంది కార్యాలయ ప్రాంగణంలో చెత్తను తొలగించారు. మొక్కల సంరక్షణ, పరిసరాలు శుభ్రపరిచ్చారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జేసీ కార్తీక్‌, అధికారులు, సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

పరిశుభ్రతే ఆరోగ్యం: ఆర్‌ఎం

నంద్యాల టౌన: మన చుట్టు ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ఆర్టీసీ ఆర్‌ఎం రజియా సుల్తానా అన్నారు. శనివారం బస్టాండ్‌ ఆవరణలో స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ప్రాంగణం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పరిసరాలను ఎస్‌వీఆర్‌ కళాశాల విద్యార్థులు, సిబ్బందితో కలిసి శుభ్రం చేశామన్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం మాధవీలత, సిబ్బంది, యూనియన నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ తాతిరెడ్డి తులసిరెడ్డి సూచించారు. శనివారం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ నారాయణ , అయ్యలూరులో ఎంపీడీవో సుగుణశ్రీ, చాబోలులో డిప్యూటీ ఎంపీడీవో శివనాగజ్యోతి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Nov 15 , 2025 | 11:42 PM