Share News

Retired Employees Welfare Association:పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:13 AM

కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలతో రాష్ట్రంలో పెన్షన్‌దారులకు సమస్యలు ఎదురవుతున్నాయని, పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్‌...

Retired Employees Welfare Association:పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

గుంటూరు(తూర్పు), జూలై 27 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలతో రాష్ట్రంలో పెన్షన్‌దారులకు సమస్యలు ఎదురవుతున్నాయని, పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు కోరారు. గుంటూరులో ఆదివారం జరిగిన అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ మూలంగా విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 12వ వేతన సవరణ పూర్తి స్థాయిలో అమలు కావాలని, మధ్యంతర భృతి 35 శాతం, 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. జీవో 315 సవరణ ద్వారా భార్యాభర్తలకు కుటుంబపెన్షన్‌ వర్తించేలా మార్పు లు చేయాలని కోరారు. అమరావతిలో పెన్షన్‌దారుల భవనం నిర్మించాలని కోరారు.

Updated Date - Jul 28 , 2025 | 05:15 AM