పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:15 PM
రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భారతీయ కిసాన సంఘ్ జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భారతీయ కిసాన సంఘ్ జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని భారతీయ కిసాన సంఘ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజోలు, జొలధరాశి ప్రాజెక్ట్‌లకు సంబంధిం చి 10వేల ఎకరాల భూసేకరణ జరిగినప్పటికీ సంబంధిత రైతులకు ఇంతవరకు పరిహారం అందక పోవడం బాధాకరమన్నారు. అక్టోబ రులోగా పరిహారం ఇవ్వకపోతే నవంబరులో ఆందోళన కార్యక్ర మా లు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.