Pemmasani Chandrashekar: ఆత్మనిర్భర భారత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేయండి
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:18 AM
ఆత్మనిర్భర భారత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని వ్యాపారవేత్తలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
వ్యాపారవేత్తలకు కేంద్ర మంత్రి పెమ్మసాని పిలుపు
న్యూఢిల్లీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర భారత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని వ్యాపారవేత్తలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీ లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడారు. ‘దేశం అన్ని రం గాల్లో పురోగమిస్తోంది. సాంకేతికతలో అద్భుత ప్రగతిని సాధించింది. నిరంతర తపనతో ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వ్యాపారవేత్తలు పాలుపంచుకోవాలి. పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టాలి’ అని పెమ్మసాని కోరారు.