రాష్ట్రంలో రైతు ప్రభుత్వం
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:42 PM
హంద్రీనీవా ద్వారా చెరువులకు నీటితో నింపి రైతు కళ్లలో ఆనందాన్ని నింపిన అపర భగీరథుడు ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
· అన్నదాత కళ్లలో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు ధ్యేయం
· ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఫ చెరువులకు జలహారతి
డోన టౌన, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా ద్వారా చెరువులకు నీటితో నింపి రైతు కళ్లలో ఆనందాన్ని నింపిన అపర భగీరథుడు ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జగదుర్తి, ఉడుములపాడు, మల్లెంపల్లె, బొంతిరాళ్ల, వెంకటాపురం, అభిరెడ్డిపల్లె, దేవరబండ, కొచ్చెర్వు చెరువులను ఇరిగేషన డీఈ చంద్రశేఖర్, ఏఈ హరికిషనతో కలిసి పరిశీలించారు. చెరువులకు ఎమ్మెల్యే కోట్ల జలహారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు బాగా పడటం తో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. నీటిని వృ థా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన లక్కసాగరం లక్ష్మిరెడ్డి, రేగ టి అర్జున రెడ్డి, నాయకులు విజయభట్టు, రేగటి అర్జునరెడ్డి, శేషఫణి గౌడు, శ్రీనివాసులు యాదవ్, శ్రీరాములు, ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్ రెడ్డి, రామాంజనేయులు, రాధమ్మ, కార్యకర్తలు ఉన్నారు.