Savita Minister: 110 బీసీ గురుకులాల్లో పేఫోన్లు
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:28 AM
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో బీసీ సంక్షేమశాఖ పే ఫోన్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 110 గురుకులాల్లో 40వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా...
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో బీసీ సంక్షేమశాఖ పే ఫోన్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 110 గురుకులాల్లో 40వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ఒక్కో గురుకులంలో 6 చొప్పున వీటిని ఏర్పాటు చేయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రొద్దం మహాత్మా జ్యోతిబాఫూలే స్కూల్‌లో సోమవారం టెలిఫోన్ బాక్సులను మంత్రి సవిత ప్రారంభించనున్నారు. ఉదయం తరగతుల ప్రారంభానికి ముందు ఒక గంట, సాయంత్రం మరో గంట ఫోన్ మాట్లాడటానికి విద్యార్థులకు అవకాశమిస్తారు. ఇందుకోసం వారికి ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్‌కార్డులు అందజేస్తారు. విద్యార్థులే మినిమం రూ.10 చొప్పున రీచార్జ్ చేసుకోవాలి.