Share News

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి: బొప్పరాజు

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:23 AM

ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌...

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి: బొప్పరాజు

నెల్లూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌, ఏపీఆర్‌ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లకుపైబడి బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోకపోతే త్వరలో జరిగే ఏపీజేఏసీ రాష్ట్రస్థాయి సమావేశంలో అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

Updated Date - Sep 06 , 2025 | 06:23 AM