pawan kalyan Birthday,: బొట్టు పెట్టి పిలిచి.. భోజనాలు పెట్టి
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:34 AM
సౌదీ అరేబియాలోని జనసేన అభిమానులు పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రియాధ్ నగరంలోని ప్రవాసాంధ్ర..
సౌదీ అరేబియాలో ఘనంగా పవన్ జన్మదినోత్సం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
సౌదీ అరేబియాలోని జనసేన అభిమానులు పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రియాధ్ నగరంలోని ప్రవాసాంధ్ర కుటుంబాలను బొట్టుపెట్టి మరీ కార్యక్రమానికి ఆహ్వానించారు. వీర మహిళలు దుగ్గరపు ఉషా, చేతన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా జనసేన అధ్యక్షుడు తాటికాయల మురారి, ఆనందరాజు, పోకూరి ఆనంద్, రావూరి శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారతదేశంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని ఉష చెప్పారు. రికార్డు స్థాయిలో జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు. జనసేన కార్యకర్తలే వంటలు చేసి, వడ్డించారు. కార్మిక క్యాంపుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు ప్రవాసాంధ్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు స్వర్ణ స్వామి, ముజ్జమీల్ శేఖ్, అంటోనీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.