Share News

Deputy CM Pawan Kalyan urges: అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:52 AM

రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి దిశ గా సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మ ధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని...

Deputy CM Pawan Kalyan urges: అప్రమత్తంగా ఉండండి

  • కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు

  • సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు

  • ఆవేశాలకు లోనై ఘర్షణకు తావీయొద్దు

  • రెచ్చగొట్టేవారిపై ఫిర్యాదు చేయండి

  • శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్‌ సూచన

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి దిశ గా సుపరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రజల మ ధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇలాంటి కుట్రలకు పాల్పడేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనసే న పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలకు శనివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల ముసుగులో, యూట్యూబ్‌ చానళ్ల పేరుతో, మరోమార్గంలోనో కులాల మధ్య, మతా ల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలా కుయుక్తుల తో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్య క్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి ఆవేశాలకులోనై ఘర్షణ వాతావరణానికి తావీయవద్దు. ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు దీనికి ఉదాహరణ. యూట్యూబ్‌ చానల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనుక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దీనిపై చట్ట ప్రకా రం కేసులు పెట్టాలి. తొందరపడి ఘర్షణ పడితే సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామర స్య వాతావరణం చెడగొట్టేలా రెచ్చగొట్టడానికి నా యకులు బయటకు వస్తా రు. కులమతాల మధ్య విభేదాలు తీసుకువచ్చేలా వ్యవహరించే వారిపై ఫిర్యాదు చేయాలి. ఈ దిశ గా ముందుకు వెళ్లాలని జనసేన శ్రేణులతో పాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాం. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చా నళ్ల రూపంలో, విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని చట్టం ముందు నిలపాలి. వీరి వెనుక ఉండి వ్యవస్థీకృతం గా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేయాలి. మచిలీపట్నంలో జరిగిన వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకుల ను ఆదేశించాను. ఈ ఘటనలో సంబంధమున్న వా రికి నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సృష్టం చేశాను.’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 03:52 AM