Pawan Kalyan Hails Democratic: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:28 AM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం..
గతంలో దాడులు.. దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు
ఇప్పుడు స్పష్టమైన తీర్పు : డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణా రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ‘గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నామినేషన్ వేయాలనుకున్నవారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకొంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీకి ఆస్కారం కలిగింది. మూడు దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేసుకోగలిగామని పులివెందుల ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రమంతా అర్థం చేసుకొంటోంది. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల ప్రజాతీర్పు సృష్టంగా వెలువడింది.’ అని పవన్ పేర్కొన్నారు.