Share News

JanaSena chief and Deputy CM Pawan Kalyan: పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కండి

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:00 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కావాలని జనసేన అధినేత...

JanaSena chief and Deputy CM Pawan Kalyan: పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కండి

  • జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలపై మాట్లాడండి

  • ఎంపీలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కావాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన జనసేన ఎంపీలతో సమావేశమయ్యారు. డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాలం సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలు అందించాలన్నారు. పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్థిక సంవత్సరం రావాల్సిన నిధుల వివరాలను కేంద్రం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 05:00 AM