వైవీ బ్యాంకు వివరాలు ఎందుకు ఇవ్వరు?: పట్టాభి
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:34 AM
రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారా...
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారా? అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేశారని తెలిసి కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని తెలిపారు. ఈ ఉదంతంలో వైవీ సుబ్బారెడ్డికి కమీషన్లు ముట్టింది వాస్తవమన్నారు. ఆయన సచ్ఛీలుడైతే తన బ్యాంకు ఖాతాల వివరాలను సిట్‌కు ఇవ్వకుండా ఎందుకు కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు.